మంచు విష్ణు కథానాయకుడిగా ప్రీతి ముకుందన్ ఫీ మేల్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదట ఏప్రిల్ 25వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇటీవల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
ఇవాళ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు విష్ణు, మోహన్ బాబు కలిశారు. ఈ సందర్భంగా యోగీ ఆదిత్యనాథ్ తో కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేయించారు. తాను ఎంతగానో అభిమానించే ముఖ్యమంత్రి యోగితో కన్నప్ప పోస్టర్ రిలీజ్ చేయించడం చాలా సంతోషంగా ఉందంటూ మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. జూన్ 27వ తేదీన కన్నప్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోందని ప్రకటించారు.