గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారన్న విషయం తెలిసిందే. ఆయన తన వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా ఆయనపై పోలీసు కేసు నమోదైంది. ఈనెల 6వ తేదీన శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా.. ఎమ్మెల్యే రాజాసింగ్ డీజే వినియోగించినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేసినట్లు మంగళ్‌హాట్ పోలీసులు వెల్లడించారు.
డీజే సౌండ్స్ పరిమితికి మించి హై వాల్యూమ్ లో పెట్టినందుకు వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇందుకోసం వారు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. శోభాయాత్ర సందర్భంగా పోలీసులను ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు అసభ్య పదజాలంతో దూషించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేసు బుక్ చేసి.. ఎఫ్ఐఆర్‌లో రాజాసింగ్‌తో పాటు మాజీ మంత్రి ఆనంద్ సింగ్, ఎంపీ అభ్యర్థి భగవంత్ రావు పేర్లు నమోదు చేశారు. డీజే సౌండ్ పరిమితికి మించి పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని పోలీసులు తెలిపారు.