బంగాల్లో వక్ఫ్ సవరణ చట్టం అమలు చేయబోమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. అన్ని వర్గాల మైనారిటీలతోపాటు వారి ఆస్తులను రక్షిస్తానని హామీ ఇచ్చారు. కోల్‌కతాలో జైన సమాజం నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న దీదీ.. రాజకీయం కోసం కొందరు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తారని, వాటిని వినొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగిస్తూ.. వక్ఫ్ చట్టం అమలు కారణంగా చాలా మంది బాధపడుతున్నారని తనకు తెలుసని అన్నారు. తనపై నమ్మకం ఉంచాలని కోరిన దీదీ.. అందరూ కలిసి ఉంటామని సందేశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విభజించు- పాలించు అనేది జరగదని.. వక్ఫ్ అమలు చేయడం కన్నా ముందు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో చూడాలని.. అందుకే వక్ఫ్ చట్టం అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బంగాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, భారతదేశం అన్నీ కలిసి ఉన్నాయని చరిత్ర చెబుతోందని సీఎం అన్నారు. విభజన తర్వాత వారంతా ఇక్కడ నివసిస్తున్నారని.. వారికి రక్షణ కల్పించడంత మ బాధ్యత అని తెలిపారు.