BREAKING: జైల్లో దర్శన్ రాజభోగాలు.. ఏడుగురు అధికారులపై వేటు!

-

Karnataka govt fired on seven jail officials in Kannada hero Darshan case :కన్నడ హీరో దర్శన్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. జైల్లో దర్శన్ రాజభోగాలు అనుభవిస్తున్న వీడియో వైరల్ ఐన సంగతి తెలిసిందే. బెంగళూరు జైల్లో గ్యాంగ్స్టర్ ధర్మతో దర్శన్ మంతనాలు జరిపినట్లు సమాచారం అందుతోంది.

Karnataka govt fired on seven jail officials in Kannada hero Darshan case

దర్శన్ వాట్సాప్ వీడియో కాల్ బయటకు రావడంతో జైలు అధికారుల ఉలికిపాటు పడటం జరిగింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్ ఐంది. ఏడుగురు జైలు అధికారులపై వేటు వేసింది కర్ణాటక సర్కార్.

కాగా, దర్శన్‌ బెంగళూరులోని పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. జైలు బ్యారక్‌ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్‌ తాగుతున్న ఫొటో ఒకటి ఆదివారం రోజున వైరల్ అయింది. రౌడీషీటర్‌ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version