హైడ్రాధికారులపై అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే తన పైన మళ్ళీ బుల్లెట్ల వర్షం కురిపించాలని.. కానీ నా స్కూలు మాత్రం కూల్చకండి అంటూ… హాట్ కామెంట్స్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. తాజాగా మీడియా తో అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ… హైడ్రా అధికారుల చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.
బండ్లగూడ లోని ఫాతిమా ఓవైసీ కాలేజీ ని హైడ్రా… ధ్వంసం చేయబోతుందని… వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు. నిరుపేదలకు ఉచిత విద్యను అందించే 12 బిల్డింగులు అక్కడ నిర్మించాలని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వీటిని కావాలని కొంతమంది తప్పుగా చూపిస్తున్నారని మండిపడ్డారు అక్బరుద్దీన్ ఓవైసీ. గతంలో తనపై కాల్పులు జరిగాయని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు మళ్లీ బులెట్ల వర్షం కురిపించాలని లేదా కత్తులతో దాడి చేయండి అంటూ హాట్ కామెంట్స్ చేశారు అక్బరుద్దీన్ ఓవైసీ. కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి మాత్రం అడ్డుపడకండి అని కోరారు.