క‌ర్నాట‌క‌లో ప్ర‌తి థియేటర్ లో సీటు నంబ‌ర్ 17 ఖాళీ….ఎందుకో తెలుసా…!

-

కన్నడ సూపర్ స్టార్ (లోహిత్) అలియాస్ పునిత్ రాజ్ కుమార్ గారు గతేడాది అక్టోబర్ 29 న మరణించిన విషయం తెలిసిందే. ఐతే ఆయన చనిపోయి నాలుగు నెలలు గడుస్తున్నా ఆయన మరణ వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కాగా 1975 సంవత్సరం మార్చి “17”న చెన్నయ్ లో జన్మించిన ఆయన 1976 లో బాల నటుడిగా కేరీర్ ను ప్రారంభించారు.

ఆయన తన సినీ జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే తన చివరి సినిమా “జేమ్స్” ఈ నెల “17” ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. దీంతో తమ అభిమాన హీరో చివరి సినిమా కావడంతో కర్ణాటక లోని థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున కోలాహలం కనిపిస్తుంది. మరోవైపు తమ అభిమాన హీరో కి భారీ ఎత్తున కటౌట్ లు పాలాబిషేకాలు నిర్వహిస్తున్నారు.

మరోవైపు బెంగుళూరు లోని ఓ థియెటర్లో ఉదయం 6 గంటల షో కి చాయ్ బిస్కెట్లు మధ్యాహ్నం బిర్యాని సాయంత్రం 4 గంటలకు సమోసాలను ఉచితంగా అందజేసి పునిత్ పై వాళ్ళకున్న ప్రేమాభిమానాలు తెలియజేస్తున్నారు. అయితే అసలు విషయం లోకి వెళ్తే కర్ణాటకలోని ప్రతీ థియేటర్ లో “17” వ నంబర్ గల సీటు ని ఖాళీగా వదిలిపెడుతున్నారట. దీనికి గల కారణం ఆ సీటులో తమ అభిమాన హీరో పునిత్ రాజ్ కుమార్ వచ్చి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూస్తారని వాళ్ళ నమ్మకం. అక్కడి అభిమానులు తమ హీరో వచ్చి వాళ్ళతో కలిసి సినిమా చుసాడని వాళ్ళ నమ్మకం.

Read more RELATED
Recommended to you

Latest news