ఉత్త‌మ తెలుగు చిత్రంగా కార్తీకేయ 2

-

70వ నేషనల్ ఫిలిం అవార్డులను ప్రకటించారు జ్యూరీ సభ్యులు. 2022 ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తీకేయ 2 నిలిచింది. కార్తీకేయ దర్శకుడు చందు మొండేటి కి కొద్ది సేపటి క్రితమే జ్యూరీ సభ్యులు కాల్ చేసారట. తెలుగులో నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం సాధించింది. ఈ చిత్రం దాదాపు  రూ.130 కోట్ల కలెక్షన్స్ సాధించింది. 

ఉత్తమ హీరోయిన్లుగా నిత్యామీనన్, మానసి పరేఖ్ నిలిచారు. ఉత్తమ కన్నడ చిత్రంగా కేజీఎఫ్ 2 నిలిచింది. ఇప్పుడు కార్తికేయ 2 సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డుని ప్రకటించారు. ఈ సినిమా డివోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కించగా ఇందులోని కృష్ణతత్వం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version