నయనతారను గెలికిన కస్తూరి.. దానికి ఒప్పుకోనంటూ..?

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్ అంటూ భాషతో సంబంధం లేకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 సంవత్సరాలకు పైగా అదే హోదాను అనుభవిస్తున్న ఈమె అంటే ఎంతోమందికి ఆదర్శం కూడా.. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త హీరోయిన్లకు నయనతార ఒక రోల్ మోడల్ అని చెప్పవచ్చు. సెలెక్టివ్ గా పాత్రలు ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించే ఈ ముద్దుగుమ్మ.. పారితోషకం విషయంలో కూడా మొదటి స్థానంలోనే ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్న ఈమె మరొకవైపు బాలీవుడ్ లో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

ఇలాంటి స్టార్ హీరోయిన్ పైన ప్రముఖ హీరోయిన్ బుల్లితెర నటి కస్తూరి శంకర్ షాకింగ్ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. కస్తూరి శంకర్ ఇటీవల మాట్లాడుతూ.. నయనతారను లేడీ సూపర్ స్టార్ గా అంగీకరించలేము అని షాకింగ్ కామెంట్లు చేసింది. ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని, ఆయనకు ఆయనే సాటి అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించి, నయనతారపై విమర్శలు చేయడం అభిమానులను ఇబ్బంది పెడుతోంది.

గతంలో కూడా నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన కస్తూరి ఇప్పుడు మళ్లీ నయనతారపై కామెంట్లు చేయడంతో సర్వత్ర హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం తెలిసి నయనతార అభిమానులు ఎందుకు నయనతారను ఇంతలా టార్గెట్ చేస్తున్నావు అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై కస్తూరి ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news