తిరుమల సన్నిధిలో నిన్న తీవ్ర విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. బాలిక పై చిరుత దాడి చేసి.. చంపేసింది. అయితే.. నడకమార్గంలో బాలిక పై చిరుత దాడి నేఫధ్యంలో అప్రమత్తమైంది టీటీడీ. ఘట్ రోడ్డులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ద్విచక్ర వాహనాలకు అనుమతి ఇచ్చింది టీటీడీ. నడకమార్గంలో భక్తులును అనుమతించే సమయాలను కూడా నియంత్రిం చాలంటున్నారు అటవిశాఖ అధికారులు.
సమయాన్ని నియంత్రిస్తే భక్తులకు ఇబ్బందులు ఎదురు అవుతాయని భావిస్తూన్నారు టీటీడీ అధికారులు. భక్తులకు రక్షణ పై దృష్టి సారించింది టీటీడీ. దీంఓ స్వయంగా పర్యవేక్షిస్తూన్నారు టీటీడీ ఇఓ దర్మారెడ్డి. 7వ మైలు నుంచి నరశింహస్వామి ఆలయం వరకు భధ్రతను కట్టిదిట్టం చేసింది టీటీడీ. ఇక సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భక్తులును గుంపులుగా అనుమతించాలని నిర్నయం తీసుకుంది టీటీడీ. భక్తులు బృందానికి ముందు, వెనుక వైపుల రోప్ పార్టీలు…పైలేట్ గా సెక్యూరిటి గార్డులను నియామకం చేయనుంది.