కత్తి మహేష్ పరిస్థితి అత్యంత విషమం..!

-

సినీ విమ‌ర్శ‌కుడు, న‌టుడు అయిన క‌త్తి మ‌హేశ్‌కు చెన్నై-కలకత్తా రహదారిపై శ‌నివారం తెల్లవారు ఝామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ప్ర‌మాదంలో ఆయ‌న‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆయ‌న్ను పోలీసులు నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ ఆస్ప‌త్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

అయితే త‌న కారుతో కంటైన‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఆయ‌న త‌ల‌కు బ‌లమైన గాయాల‌య్యాయి. దీంతో డాక్ట‌ర్లు ఆయ‌న్ను స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఆయ‌న ప‌రిస్థితి విష‌మంగానే ఉన్న‌ట్టు ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్పాయి. ఆయ‌న ఆరోగ్యంపై మరికొన్ని గంటల్లో హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తామ‌ని వివ‌రించారు.

అయితే ఆయ‌న త‌ల‌కు పూర్తిగా క‌ట్టు క‌ట్టారు డాక్ట‌ర్లు. ర‌క్తం కూడా బాగానే పోతోంది. కంటి చూపు దెబ్బ‌తింద‌ని స‌మాచారం. ఎందుకంటే ఆయ‌న త‌ల‌కు మాత్ర‌మే బ‌లంగా గాయాలు అయ్యాయి. దీంతో బ్రెయిన్‌పై ఆ ఎఫెక్ట్ ప‌డే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికైతే ఆయ‌న ప‌రిస్థితి అత్యంత విష‌మంగానే ఉంది. డాక్ట‌ర్ల హెల్త్ బులిటెన్ వ‌చ్చాకే అస‌లు విష‌యం తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version