సీనియర్ హీరోయిన్ కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తాటిల్ ను పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 12న గోవా వేదికగా ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. 15 ఏళ్లుగా తన రహస్య స్నేహితుడు ఆంటోనీతో కీర్తి సురేష్ ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు.
గత నెలలోనే తన ప్రేమ వ్యవహారాన్ని కీర్తి సురేష్ సోషల్ మీడియా ద్వారా పేర్కొంది. పెళ్లికి ముందు తిరుమల వెంకన్న ని కూడా దర్శించుకుని ఆశీస్సులు తీసుకుంది. తొలుత క్రిస్టియన్ పద్ధతిలో ఆంటోనీ – కీర్తి సురేష్ పెళ్లి జరగగా.. ఆ తర్వాత హిందూ సాంప్రదాయంలో జరగనుంది. గోవాలోని వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం కీర్తి సురేష్, ఆంటోనీ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కీర్తి సురేష్ వదిలిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక సౌత్ లో బిజీ హీరోయిన్ గా ఉన్న కీర్తి సురేష్.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తోంది. ఆమె నటించిన బేబీ జాన్ మూవీ త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ పెళ్లి పనుల వల్ల ఆమె ఎక్కువగా ప్రమోషన్స్ కి రావడం లేదు.