జెమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

-

దేశం మొత్తం ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన జెమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్ లో “వన్ నేషన్ – వన్ ఎలక్షన్” బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. దీంతో సమగ్ర బిల్లు పార్లమెంట్ ముందుకు చర్చకు రానుంది. దేశంలో వేరువేరుగా ఎన్నికల నిర్వహణ దేశ ప్రగతికి ఆటంకంగా పరినమిస్తోందంటూ కేంద్రంలోని బిజెపి మొదటి నుంచి వాదిస్తోంది.

ఈ మేరకు గురువారం మోడీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ఆమోదముద్ర పడింది. జెమిలి ఎన్నికలు అనేవి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కల. నరేంద్ర మోడీ కలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా జమిలి ఎన్నికలు తీసుకురావాలని గత ఆరు సంవత్సరాలుగా పట్టుదలతో పనిచేస్తున్నారు. వాస్తవానికి 2019 లోక్సభ సాధారణ ఎన్నికలలో బిజెపి అప్రతీహత విజయం సాధించి వరుసగా రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే ఈ ఎన్నికల ప్రతిపాదన తీసుకురావాలని ప్రయత్నాలు చేసింది.

అయితే ఐదేళ్లపాటు అవి నెరవేరలేదు. ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో మోడీ వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రి అయ్యారు. ఈసారి ఎలాగైనా జమిలి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కంకణంతో ఉన్నారు. ఇందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కానీ పార్లమెంటులో రాజ్యాంగ సవరణలకు కూటమికి అవసరమైన సంఖ్య బలం లేదు. అయినా ఈ బిల్లు ఆమోదించుకునేందుకు ముందుకు వెళ్లాలని మోడీ భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news