BREAKING: రాజకీయాల్లోకి కీర్తి సురేశ్?

-

అలనాటి మహానటి సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన అందాల నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ ఫిల్మ్ తో నేషనల్ అవార్డు పొందిన ఈ సుందరి..తన నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేసింది. ప్రజెంట్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ప్రతీ విషయాన్ని ఎప్పడికప్పుడు షేర్ చేస్తుంటుంది ఈ ముద్దు గుమ్మ.

అయితే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అన్న వార్త మరోసారి వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉందా? అని అడగగా ఆ విషయం గురించి ఆలోచిస్తానని చెప్పారు. దీంతో ఆమె రాజకీయాల్లోకి వస్తారని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తో మంచి స్నేహబంధం ఉండటం కూడా కీర్తికి ప్లస్ పాయింట్ అని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news