దమ్ముంటే.. లోకేశ్ నాపై పోటీ చేయాలి: అనిల్ కుమార్ యాదవ్ సవాల్

-

నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా టిడిపి నేత నారా లోకేష్ కు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ‘దమ్ముంటే లోకేష్ నెల్లూరులో 2024 ఎన్నికల్లో నాపై పోటీ చేయాలని సవాల్ చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.

నా గెలుపును ఆపితే… రాజకీయాల నుంచి తప్పుకుంటా. నన్ను ఓడించేందుకు టిడిపి రూ.200 కోట్లు సిద్ధం చేసింది. నా కుటుంబానికి చరిత్ర లేకపోయినా ఎమ్మెల్యేగా గెలిచా. తాత, నాన్న సీఎంలు అయినా లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు’ అని ఎద్దేవా చేశారు.ఇక అటు ఆనం రామనారాయణ రెడ్డి పై విరుచుకుపడ్డారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నేను ఆరుసార్లు గెలిచానని అంటున్నావు… పార్టీ గాలి ఉన్నప్పుడే నువ్వు గెలిచావంటూ ఫైర్ అయ్యారు. అది గుర్తుంచుకో… ధైర్యముంటే నాతో తలపడ అంటూ సవాల్‌ చేశారు. నా సవాల్ స్వీకరిస్తావా లేదా ఆత్మకూరు నుంచి పోటీ చేస్తావా… తేల్చుకో అంటూ ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news