రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ఎక్కువగా పోయేది ఇంజనీరింగ్ కళాశాలలకు. సీఎం చంద్రబాబు నాయుడు మొట్టమొదటిసారి సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనదే అని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇక చంద్రబాబు నాయుడు చలువ వల్లే ఇంజనీరింగ్ విద్య గ్రామీణ విద్యార్థులకు దగ్గర అయింది. కానీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయో గమనించాలి.
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు మూత పడేలా చేసింది జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన ఎనిమిది నెలల్లో 700 కోట్లు ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను ఆదుకున్నాం. గత ప్రభుత్వంలో 50 నుంచి 60 కాలేజీలు మూతపడ్డాయి. తప్పు చేసింది వాళ్లు.. కానీ ఇప్పుడు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉంది. అటువంటి దీక్షలను ప్రజలు హర్షించరు. అమెరికాలో కూడా తెలుగువారు శాశించే స్థాయిలో ఉన్నారంటే అది సీఎం చంద్రబబు ఘనతే అని రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.