బన్ని అయ్యాడు మల్లూ అర్జున్.. కేరళలో గ్రాండ్ వెల్కం

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కేవలం తెలుగులోనే కాదు మళయాళంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బన్ని సినిమాలు అక్కడ వరుసగా రిలీజ్ అవడం అక్కడ హిట్ అవడంతో బన్నికి అక్కడ మల్లుస్టార్ గా క్రేజ్ తెచ్చి పెట్టింది. అక్కడ స్టార్ సినిమాలకు ధీటుగా మళయాళంలో అల్లు అర్జున్ సినిమాల హంగామా ఉంటుంది. బన్ని సినిమా రిలీజ్ అంటే అక్కడ స్టార్ సినిమాలు ఆలోచించే పరిస్థితి వచ్చింది.

టాలీవిడ్ తో పాటుగా మల్లూవుడ్ లో క్రేజ్ తెచ్చుకున్న బన్ని అక్కడకు ఓ స్పెషల్ ప్రోగ్రాం కోసం గెస్ట్ గా వెళ్లాడు. బన్ని మల్లూ ఫ్యాన్స్ బన్నిని ఎయిర్ పోర్ట్ నుండే రిసీవ్ చేసుకుని హడావిడి చేశారు. వెల్ కం బ్యాక్ గాడ్స్ ఓన్ కంట్రీ మల్లు అర్జున్ అంటూ బ్యానర్ లు కట్టారు. ఇటీవల వరదల వల్ల భారీగా నష్టపోయిన కేరళకు అల్లు అర్జున్ పాతిక లక్షల ఆర్ధిక సాయం అందించాడు.

ఇక ఇప్పుడు కేరళలో జరుగనున్న నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కు బన్ని అతిథిగా వచ్చాడు. బన్నికి అక్కడ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎయిర్ పోర్ట్ కు వచ్చిన వారిని చూస్తే తెలుస్తుంది. మెగాస్టార్ తర్వాత స్వయంగా తన స్టైలిష్ యాక్టింగ్ తో ఇలా భాషతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ను ఏర్పరచుకోవడం బన్నికే చెల్లిందని చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version