జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్ నెలకొంది.. జానీ మాస్టర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 లో డీషోలో జానీ మాస్టర్ కు పరిచయమైంది బాధిత యువతి. ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుండి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ యువతికి ఫోన్ కాల్ వచ్చిందట. 2019లో జానీ మాస్టర్ టీం లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా జాయిన్ అయ్యారట ఆ యువతి.
ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మర ఇద్దరితో కలిసి ముంబైకి వెళ్లింది ఆ యువతి. ఇక ముంబైలోని హోటల్లో యువతిపై అత్యాచారానికి జానీ మాస్టర్ పాల్పడినట్లు ఎఫ్ఐఆర్ లో తేలింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరింపులకు పాల్పడ్డాట. ఇక అదే మాదిరిగా షూటింగ్లో సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత యువతి. తరచూ యువతిపై జానీ మాస్టర్ అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులు చేశాడట. మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చేశాడట జానీ మాస్టర్.