హీరో సిద్దార్థ్ తో పెళ్లి తరువాత అదితి రావు తొలి పోస్ట్ ఇదే..!

-

వివాహ బంధంలోకి అడుగుపెట్టారు నటుడు సిద్ధార్థ్, నటి అదితి రావు హైదరీ. వీరు గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇవాళ వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి  దేవాలయంలో  కుటుంబ సభ్యులు, బంధువుల మధ్య ఘనంగా వివాహం చేసుకున్నారు సిద్ధార్థ్, అదితి రావు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరోవైపు  నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో పెళ్లి తరువాత హీరోయిన్ అదితిరావు తన తొలి పోస్ట్ పెట్టారు. “నువ్వే నా సూర్యుడు, నువ్వే నా చంద్రుడు, నువ్వే నా తారాలోకం, మిస్సెస్ అండ్ మిస్టర్ సిద్దు” అని రాసుకొచ్చారు అదితిరావు. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలో వీరికి పరిచయం ఏర్పడింది. అక్కడి నుంచి వీరి లవ్ ట్రాక్ కొనసాగింది. ఇటీవలే వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాయకస్వామి  దేవాలయంలో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. త్వరలోనే పెళ్లి జరుగుతుందని అప్పుడో సోషల్ మీడియాలో చెప్పారు. చెప్పినట్టుగానే ఇవాళ పెళ్లి చేసుకున్నారు సిద్దార్థ్, అదితిరావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version