కన్నడ నటుడు యష్ సైతం ‘కేజీఎఫ్’తో టాప్ స్టార్‌లో ఒకరిగా ఎదిగారు. క్రేజీ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) కథాంశం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు.
ఒక్క సినిమా ఎంతో మంది జీవితాలనే మార్చేస్తుంది. ఒక్క సక్సెస్ నటీనటులను ఎక్కడో కూర్చోబెడుతుంది. అదే ఫెయిల్ అయితే కనిపించకుండానూ చేస్తుంది. ‘అర్జున్‌రెడ్డి’తో విజయ్ దేవరకొండ, ‘మహానటి’తో కీర్తిసురేష్, ‘ఆర్ ఎక్స్ 100’తో కార్తికేయ ఒక్కసారిగా స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు.
అలాగే కన్నడ నటుడు యష్ సైతం ‘కేజీఎఫ్’తో టాప్ స్టార్‌లో ఒకరిగా ఎదిగారు. క్రేజీ స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్(కేజీఎఫ్) కథాంశం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. ప్రశాంత్ నీల్ దర్శకుడు.
స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో కోలార్ బంగారు గనులపై మాఫియా ఆధిపత్యం ప్రధానంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో మాఫియా కన్ను ఎలా ఉందనేది చూపించారు. రెండో భాగంలో హీరో వారిని అంతం చేయడం ప్రధానంగా భారీ పోరాట ఘట్టాలతో సాగుతుందని, ఆద్యంతం రసవత్తరంగా ద్వితీయభాగం ఉంటుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.
యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయట. కనీవినీ ఎరుగని స్థాయిలో యాక్షన్ సీన్స్ ఉంటాయట. దానికోసం భారీగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన తొలి భాగం విశేష ఆదరణ పొందింది. దాదాపు ఇది రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇదే అత్యధిక వసూళ్ళు రాబట్టి చిత్రంగా చెబుతున్నారు. ఇది కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీలో కూడా విడుదలైంది.
తాజాగా దీనికి రెండో భాగం రూపొందుతుంది. బెంగుళూరులో తాజా షెడ్యూల్ జరుగుతుంది. అనంతరం మైసూర్, రామోజీ ఫిల్మ్ సిటీ, కర్నాటకలో చిత్రీకరించబోతున్నారు. సెప్టెంబర్‌తో 90శాతం చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ ఏడాది చివర్లో ఈ ‘కేజీఎఫ్ 2’ని విడుదల చేయనున్నట్టు టాక్. ఇందులో సంజయ్ దత్ వంటి పలువురు బాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. మరి ‘కేజీఎఫ్’ మొదటి భాగం సంచనల సృష్టిస్తే, రెండో భాగం మరెంతటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫస్ట్ పార్ట్ తో స్టార్ అయిపోయిన యష్ రెండో భాగం విజయం సాధిస్తే కన్నడ పరిశ్రమలో తిరుగులేని అగ్ర కథానాయకుడిగా నిలుస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.