ఖుషి: అతడికి మాత్రమే డబుల్ పేమెంట్.. ఎందుకబ్బా..?

-

శివనిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా.. పాన్ ఇండియా హీరోయిన్ సమంత లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం ఖుషి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వార్త ఇప్పుడు నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ సినిమా విషయంలో ఒకరికి మాత్రం డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అనే వార్తలు నెట్టింట ఒక్కసారిగా వైరల్ గా మారుతున్నాయి. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు కూడా ఎందుకబ్బా..? అతడికి మాత్రమే డబుల్ పారితోషకం ఎందుకు.. సినిమాకు పనిచేస్తే.. అందరికీ ఒకసారి మాత్రమే పారితోషకం ఇస్తారు కదా..? ఎందుకు ప్రత్యేకించి రెండు సార్లు పారితోషకం ఇవ్వడం..?

ఇంతకీ అలా డబుల్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది ఎవరు అంటూ తెగ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఆయన ఎవరో కాదు డైరెక్టర్ శివ నిర్వాణ అని సమాచారం. నిన్ను కోరి సినిమాతో మొదలైన అతడి డైరెక్షన్ టాలెంట్ రెండో సినిమా మజిలీతో కూడా సూపర్ హిట్ అందుకుంది. ఇక మూడవ సినిమా టక్ జగదీష్ అయినప్పటికీ కూడా ఆయన మీద నమ్మకంతో విజయ్ దేవరకొండ అవకాశం ఇచ్చారు. అటు ఖుషి సినిమా సమంత , విజయ్ ఇద్దరికీ హిట్ వెరీ ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గా మాత్రమే కాదు లిరిక్ రైటర్ గా కూడా శివా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమా నుంచి మూడు పాటలు రిలీజ్ కాగా ఆ మూడు పాటలకి శివ నిర్వాణ సాహిత్యం అందించాడట. అందుకే శివ నిర్వాణ కి ఖుషి సినిమా ద్వారా డబుల్ రెమ్యునరేషన్ అందుకునే అవకాశం లభించిందని సమాచారం. ఇక ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోన్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version