`ఆకాశమే నీ హద్దురా` చిత్రంలో మోహన్ బాబు లుక్ అదిరింది.. వైర‌ల్ అవుతున్న ఫోటో..!

-

గత కొంతకాలం గా వరుస ప్లాప్స్ ఎదురుకుంటున్న తమిళ్ హీరో సూర్య తాజాగా న‌టిస్తున్న చిత్రం `ఆకాశమే నీ హద్దురా`. ‘ఎయిర్ డెక్కన్’ ఫౌండర్ జీ ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని.. గురు సినిమాని డైరెక్ట్ చేసిన సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్నారు. ‘సూరారై పొట్రు’ అనే టైటిల్ తో తమిళంలో వస్తున్న ఈ సినిమాకు తెలుగులో ”ఆకాశమే నీ హద్దురా” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో టాలీవుడ్ అగ్రనటుడు కింగ్‌ మోహన్‌ బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన లుక్ ను మోహన్ బాబు ట్విట్టర్ లో పంచుకున్నారు. భారత వాయుసేనకు చెందిన అధికారిగా మోహన్ బాబు ఎంతో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక‌ ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్ కు మంచి ఆదరణ లభిస్తోంది. కాగా, మ్యూజిక్ సెన్సేషన్ జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సూర్య తమ సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ సినిమాని 2020 సమ్మర్ లో విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news