కిరాక్ ఆర్పీ జబర్దస్త్ మానేసి.. మంచి పని చేశాడా..?

-

బుల్లితెర షోలలో బాగా పాపులారిటీ దక్కించుకున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్.. సీనియర్ స్టార్ హీరో, హీరోయిన్లకు ఆర్థికంగా భరోసా ఇచ్చిన ఈ షో ఎంతో మంది కొత్తవారికి కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అంతేకాదు ఈ షోలో కమెడియన్లుగా చేసిన ప్రతి ఒక్కరు కూడా భారీ పాపులరిటీ దక్కించుకోవడమే కాకుండా సినిమాలు కూడా అవకాశాలు అందుకున్నారు. మరి కొంతమంది ఈ మధ్యకాలంలో ఒక్కొక్కరిగా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్తున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో కిరాక్ ఆర్పీ కూడా ఒకరు. ఆర్పీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో జబర్థస్త్ ను విమర్శించిన విషయం తెలిసిందే.

ఫుడ్ సరిగా ఉండదు అని.. కమెడియన్లకు ప్రాధాన్యత ఇవ్వరు అని.. ఇచ్చిన పేమెంట్ తోనే జీవితాలను సరిపెట్టుకోవాలని ఇలా రకరకాలుగా కిరాక్ ఆర్పీ జబర్దస్త్ పై పలు విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత కామెడీ స్టార్ట్స్ వంటి కామెడీ షోలో పార్టిసిపేట్ చేసినప్పటికీ షో కి టిఆర్పి రేటింగ్ రాకపోవడం వల్ల షో మూసేశారు. దీంతో మళ్లీ జబర్దస్త్ లోకి రీఎంట్రీ ఇవ్వలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అంటూ రకరకాల వార్తల వైరల్ అయ్యాయి . కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన జబర్దస్త్ ను వదిలేసి మంచి పని చేశాడు లేకపోతే ఇంత స్థాయిలో డబ్బు సంపాదించేవాడు కాదు కదా అంటూ కామెంట్ లు వినిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే జబర్దస్త్ నుంచి వచ్చిన తర్వాత కిరాక్ ఆర్పి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట రెస్టారెంట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేవలం కట్టెల పొయ్యి మీద మాత్రమే చేసే చేపల పులుసుకు విపరీతమైన డిమాండ్ పెరిగింది . దీంతో రోజుకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం లభిస్తుంది. దీన్ని బట్టి చూస్తే జబర్దస్త్ లోకి వెళ్లి ఉంటే ఈ రేంజ్ లో ఆయన పాపులారిటీ అలాగే డబ్బు సంపాదించేవారు కాదని మరి కొంతమంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుంచి వచ్చి ఇప్పుడు రెస్టారెంట్ ద్వారా భారీ స్థాయిలో లాభార్జన పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version