వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన కేఎల్ రాహుల్, అతియా శెట్టి

-

టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ బ్యూటీ అతియా శెట్టి గతేడాది వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. కొంతకాలం ప్రేమలో ఉన్న ఈ జంట గత సంవత్సరం పెద్దల సమక్షంలో గ్రాండ్గా వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ జంట తమ మొదటి వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంది. ఈ నేపథ్యంలో తమ అభిమానులకు రాహుల్, అతియా ఓ అందమైన సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే..?

రాహుల్, అతియా తమ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా తమ వెడ్డింగ్ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ వీడియో పోస్టు చేసిన జంట (inding you was like coming home) అంటూ అందమైన క్యాప్షన్ను జోడించింది. ఈ వీడియో చాలా బ్యూటీఫుల్గా ఉంది. సినిమాటిక్ లెవెల్లో ఈ జంట తమ లైఫ్లోని బ్యూటీఫుల్ క్షణాలను ఆ వీడియోలో బంధించింది. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ వీడియో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. మరెందుకు ఆలస్యం మీరూ ఆ వీడియో చూసేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version