స్వాతంత్ర్యం గాంధీజీ వల్ల రాలేదు: తమిళనాడు గవర్నర్

-

స్వాతంత్ర్యం గాంధీజీ వల్ల రాలేదని సంచలనం వ్యాఖ్యలు చేశారు తమిళనాడు గవర్నర్ రవి. నిన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ రవి వివాదాస్పద వాక్యాలు చేశారు. మన దేశానికి స్వాతంత్రం గాంధీజీ ఉద్యమం వల్ల రాలేదని, సుభాష్ చంద్రబోస్ పోరాటం వల్లే వచ్చిందని అన్నారు.

Tamil Nadu governor RN Ravi gives more credit to Netaji than to Gandhiji for India’s Independence

‘గాంధీ ఉద్యమం వల్ల 1942 తర్వాత ఏమీ జరగలేదు. మనలో మనమే గొడవ పడ్డాం. నేతాజీ ఇతర దేశాల సైన్యం సాయంతో బ్రిటిషర్లపై ఒత్తిడి తెచ్చారు. ఆయన లేకుంటే 1947లో స్వాతంత్రం వచ్చేది కాదు’ అని అన్నారు. అయితే.. తమిళనాడు గవర్నర్ రవి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే లేస్తోంది. ప్రభుత్వ హోదాలో ఉండి… తమిళనాడు గవర్నర్ రవి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆగ్రహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version