తమిళ అర్జున్ రెడ్డి ‘వర్మ’ టీజర్

-

లాస్ట్ ఇయర్ వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా విజయ్ కు యూత్ లో భారీ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. ఇక ఈ సినిమా ఇక్కడ హిట్ అవడం చూసి తమిళ, హింది భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు.

తమిళంలో విక్రం తనయుడు ధ్రువ్ డెబ్యూ మూవీగా అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తున్నారు ఈ సినిమాకు తమిళంలో టైటిల్ గా వర్మ అని పెట్టడం జరిగింది. తమిళ క్రేజీ దర్శకుడు బాలా డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. చియాన్ తనయుడు ధ్రువ్ లుక్ బాగుంది.

డెబ్యూ మూవీ కాబట్టి ధ్రువ్ లుక్ ఓకే అనేలా ఉంది. అయితే ఏమాటకామాట చెప్పాలంటే తమిళ అర్జున్ రెడ్డి టీజర్ అప్పియరెన్స్ తెలుగు అర్జున్ రెడ్డిని డామినేట్ చేయడంలో మాత్రం వెనుకపడ్డాడని చెప్పొచ్చు. ధ్రువ్ మొదటి సినిమానే ఇలాంటి బోల్డ్ అటెంప్ట్ చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే తెలుగులో వచ్చిన రిజల్ట్ వస్తుందా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version