పోరా శ్రీమంతుడా.. పోపోరా శ్రీమంతుడా.. సైకిల్ పై వచ్చి ఓటేసిన తమిళ స్టార్ విజయ్..!

Join Our Community
follow manalokam on social media

పైన ఫోటో చూస్తే మనకు శ్రీమంతుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు గుర్తుకు రావడం పక్కా. తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్న సందర్భంగా అక్కడి సూపర్ హీరో దళపతి విజయ్ సైకిల్ మీద వచ్చి ఓటు వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తన ఇంటి నుండి పోలింగ్ స్టేషన్ చాలా దగ్గర అవడంతో విజయ్ సైకిల్ మీద వెళ్లి ఓట్ వేసి వచ్చారు. అయితే విజయ్ కు సపోర్ట్ గా తన ఫాలోవర్స్ పక్కన ఉన్నారు.

Kollywood Star Vijay Arrives with Cycle

విజయ్ ఇలా సైకిల్ మీద వేళ్లి ఓటేయడాన్ని బిల్డప్ అంటూ కొందరు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే కేవలం పోలింగ్ స్టేషన్ దగ్గరగా ఉండటం వల్లే విజయ్ అలా సైకిల్ మీద వెళ్లి ఓటు హక్కుని వినియోగించుకున్నాడని అంటున్నారు. కోలీవుడ్ లో విజయ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. ఆయన ప్రతి సినిమా అక్కడ 200 కోట్ల క్లబ్ లో చేరుతుంది. తమిళనాడులో విజయ్ కూడా ఓ పార్టీ పెడతాడని.. ఆయన రాజకీయాల్లోకి వస్తాడని ఎప్పటినుండో ఓ టాక్ వినిపిస్తుంది. అయితే ఆ విషయంపై మాత్రం విజయ్ ఎలాంటి రిప్లై ఇవ్వట్లేదు.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...