ఎన్.టి.ఆర్ బర్త్ డే కి కొమరం భీం వీడియో టీజర్ రెడీ అవుతోంది ..ఫ్యాన్స్ బి రెడీ …!

-

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుథిరం. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. టాలీవుడ్ స్టార్స్ ఎన్.టి.ఆర్, రాం చరణ్ లు హీరోలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, మరో సీనియర్ హీరో అజయ్ దేవ్ గన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. రాజమౌళి బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా.. అందులోను ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటం తో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 

ఒకవైపు లాక్ డౌన్ ఉన్నప్పటికి రాజమౌళి మాత్రం తనపని తను చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఒకసారి రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్ చేసే ఛాన్స్ లేదని రీసెంట్ గా రాజమౌళి వెల్లడించారు. అందుకే షూటింగ్ ఆగినప్పటికి ఈ సినిమాకి సంబంధించిన వీఎఫెక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ పనులు పూర్తి చేస్తున్నారట. ఇక దాదాపు షూటింగ్ కంప్లీటయిన ఈ సినిమా మిగతా వర్క్ ని రామోజీ ఫిల్మ్ సిటిలో కంప్లీట్ చేయనున్నారు. ఈ మేరకు సెట్ కూడా నిర్మించారట. 2021 జనవరి 8 ని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా, రాం చరణ్ అల్లూరి సీతా రామరాజుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే చరణ్ బర్త్ డే సందర్భంగా అల్లూరి సీతారామరాజు పాత్రని వీడియో టీజర్ ద్వారా రివీల్ చేశారు రాజమౌళి. ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు అప్పటి నుంచి ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చుస్తున్నారు. అందుకే రాజమౌళి ఎన్.టి.ఆర్ బర్త్ డే కి కొమరం భీం పాత్రని రివీల్ చేయడానికి సర్వం సిద్దం చేస్తున్నారట. హై వోల్టేజ్ తో ఉండే ఈ వీడియో టీజర్ తో ఆర్ ఆర్ ఆర్ ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చని సమాచారం. ఇక ఈ వీడియో టీజర్ చూడాలంటే ఎన్.టి.ఆర్ బర్త్ డే అయిన మే 20 వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version