RRR బిగ్‌ అప్డేట్‌…” కొమరం భీముడో” ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్

-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన భారీ ఇండియా సినిమా. “రౌద్రం రణం రుధిరం.” చిత్రం నుండి ఇప్పుడు మేకర్స్ ఒక్కో పాటని అలాగే సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని కొన్ని రోజుల గ్యాప్ లలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి ఒక అపురూపమైన మ్యూజిక్ ఆల్బమ్ చేస్తే దానిలో మాత్రం సినిమా చూశాక మరియు ఆదరణ వచ్చిన పాట ఒకటి ఉంది.

ఆ పాటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఎమోషనల్ సాంగ్ ” కొమరం భీముడో” సినిమా రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఈ సాంగ్ ని సూపర్ హిట్ చేశాడు. అందుకే ఈ వీడియో సాంగ్ కోసం ఎప్పుడు నుంచో చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజాగా ” కొమరం భీముడో” ఫుల్‌ సాంగ్‌ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే విడుదల చేసింది. విడుదల కాసేపటికే.. యూట్యూబ్‌ ను షేక్‌ చేస్తోంది ” కొమరం భీముడో” సాంగ్‌. కాగా.. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version