`నిశ్శబ్దం` అనుష్క కోసం రాసిన కథ కాదట: కోన వెంకట్

-

స్వీటీ అనుష్క శెట్టి నటించిన సినిమా రిలీజై ఇప్పటికే చాలా కాలం అవుతోంది. ప్ర‌స్తుతం అనుష్క చేస్తున్న కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’. ఈ చిత్రం జనవరి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుష్క చిత్రకారిణిగా కనిపించనుంది. తాజాగా ఈ సినిమాను గురించి రచయిత కోన వెంకట్ మాట్లాడుతూ .. “నిజానికి ఈ కథ అనుష్కను దృష్టిలో పెట్టుకుని రాసింది కాదు. కథ రాసుకున్న తరువాత ఓ స్టార్ హీరోయిన్ తో చేస్తే బాగుంటుందని అనుకున్నాను.

అలాంటి పరిస్థితుల్లోనే నేను ముంబై నుంచి హైదరాబాద్ విమాన ప్రయాణం చేస్తున్నాను. అనుకోకుండా అనుష్క కూడా అదే విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఆమెకి నేను ఈ కథను గురించి చెప్పాను. కొన్ని రోజుల తరువాత అనుష్క కాల్ చేసి ఆ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింద‌ట‌. అనుష్క కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల జాబితాలో ఈ సినిమా తప్పకుండా చేరుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version