అయ్యో.. కొరటాల శివకు అంత అన్యాయం జరిగిందా? క్రెడిట్​ కొట్టేశారా?

-

సాధారణంగా డైరెక్టర్​ అంటే బిహైండ్ ది స్క్రీన్​ హీరో. అన్నీ తానై చూసుకుంటూ సినిమాను తెరకెక్కిస్తారు. కొంతమంది దర్శకులు తమ కథలను తామే రాసుకుంటే, మరి కొంతమంది ఇతర రచయితల కథలను వెండితెరపై చూపిస్తుంటారు. ఎంతో మంది రచయితలు కూడా సిల్వర్​స్క్రీన్​ డైరెక్టర్స్​ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవారున్నారు. స్టార్ డైరెక్టర్స్​ కూడా ఎదిగారు. అలాంటి వారిలో కొరటాల శివ ఒకరు.

కొర‌టాల శివ ఒక‌ప్పుడు ర‌చ‌యిత‌గా ప‌లు సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించారు. కొర‌టాల సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో కెరీర్​ ఆరంభంలో త‌న మేన‌మామ పోసాని కృష్ణ ముర‌ళి వ‌ద్ద అసిస్టెంట్​గా ప‌నిచేశారు. అంతే కాకుండా ప‌లు చిత్రాల‌కు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్​గా కూడా ప‌నిచేశారు. మున్నా, బృందావ‌నం, ఒక్క‌డున్నాడు స‌హా ప‌లు చిత్రాల‌కు స్క్రీన్​ రైటింగ్​ చేశారు.

ఇక 2013లో మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత కొర‌టాల ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌ను అందుకున్నారు. అదే విధంగా జ‌న‌తా గ్యారేజ్, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఇక రీసెంట్​గా రూపొందించిన ఆచార్య మాత్రం దెబ్బకొట్టింది.

అయితే కొర‌టాల ఒకానొక సందర్భంలో తన క్రెడిట్​ మరొకరు కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను సింహా సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేశాన‌ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ త‌న పేరును టైటిల్స్​లో వేయ‌లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ తాను ద‌ర్శ‌కుడిగా అవ్వ‌డానికి అది కూడా ఒక కార‌ణం అయ్యింద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version