మునుగోడులో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో పర్యటించిన చాడ..మీడియాతో మాట్లాడారు. విద్యాలయాలు కాషాయ నిలయాలు కావొద్దని.. మతోన్మాదంతో దేశంలో బిజెపి పాలన సాగిస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చేందుకు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తుందని పేర్కొన్నారు.
విద్యా కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని.. విద్యాలయాలు మత,కుల నిలయాలు కాకూడదని పోరాడుతున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని వివరించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తుంది… విద్యుత్ సవరణ చట్టం వల్ల సబ్సిడీ ఉండదు, రైతులకు ఉచిత విద్యుత్ ఉండదని హెచ్చరించారు.
ఆదానీ,అంబానీ లు మోడీకి పెద్ద కొడుకు, చిన్న కొడుకులు అని.. మోడీ ప్రభుత్వం సహజ వనరులను దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నదని ఆగ్రహించారు. దేశంలో పేదలు అల్లాడు తోడుంటే మోడీ ప్రభుత్వం జీఎస్టీ తో సామాన్యులపై భారం మోపింది..పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను విపరీతంగా పెంచింది.. ట్యాక్స్ లతో సామాన్య ప్రజల బతుకులు దుర్భరంగా తయారయ్యాయని మండిపడ్డారు.