BREAKING : ఆరోగ్యంగానే టాలీవుడ్ నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నారు. సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆరోగ్యం పూర్తిగా విషమించిందని… ఆయన మరణించినట్లు ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఆయన నిన్న రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు… ఈ తరుణంలోనే ఇవాళ ఉదయం ఆయన మరణించినట్లు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వార్తలు రాస్తున్నారు. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవమేనని సమాచారం అందుతుంది. కోట శ్రీనివాసరావు… ఆరోగ్యంగా ఉన్నట్లు టాలీవుడ్ ప్రముఖులు చెబుతున్నారు. ఆయన మృతి పై వస్తున్న వార్తలు ఎవరూ కూడా నమ్మవద్దని… కోరుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.