తిరుమలలో విషాదం… 6 గురు మృతి… జగన్ సీరియస్ !

-

 

తిరుమల శ్రీవారి సన్నిధిలో విషాదం చోటుచేసుకుంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏకంగా ఆరుగురు భక్తులు మృతి చెందారు. తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటుచేసుకుంది. విష్ణు నివాసం, బైరాగి పట్టెడ, శ్రీనివాసం, సత్యనారాయణపురం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మృతి చెందగా, 25 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఇక గాయపడినవారిని రుయా ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో పట్టించుకునే నాథుడే లేడంటూ భక్తుల మండిపడ్డారు.

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు శ్రీ వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమన్నారు. తక్షణం అక్కడ పరిస్థితులను చక్కదిద్దడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు కోలుకోవాలని ఆకాంక్షించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version