కృష్ణవంశీ సూపర్ హిట్ రీమేక్

-

ఒకప్పుడు క్రియేటివ్ డైరక్టర్ గా ఇండస్ట్రీ హిట్లు అందుకున్న కృష్ణవంశీ ఇప్పుడు కెరియర్ దాదాపు ముగింపు దశలో ఉన్నాడు. హిట్ కోసం దశాబ్ధం నుండి ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ప్రస్తుతం ఓ మరాఠి సూపర్ హిట్ రీమేక్ ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. 2016లో మరాఠిలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ మూవీని తెలుగులో కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నట్టు ఫిల్మ్ నగర్ టాక్.

దిల్ రాజు ఈ సినిమా నిర్మిస్తుండగా ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడట. మరాఠిలో మహేష్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన నట సామ్రాట్ మూవీలో నానా పటేకర్ లీడ్ రోల్ చేశారు. ఓ నటుడి జీవితంలోని వివిధ కోణాలను, ఒడిదుడుకులను ఈ సినిమాలో చూపిస్తారట. కృష్ణవంశీ డైరక్షన్ లో అంతపురం లాంటి సినిమాలో నటించిన ప్రకాశ్ రాజ్ ఈ నట సామ్రాట్ తో మరోసారి తన సత్తా చాటుతాడని అంటున్నారు. మరి ఈ మూవీతో కృష్ణవంశీ కూడా తన డైరక్షన్ టాలెంట్ చూపిస్తాడేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version