KrishnaVrindaVihari : ‘కృష్ణ వ్రిందా విహారి’ ట్రైలర్ రిలీజ్.. రొమాన్స్ ఓవర్ లోడేడ్ !

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డజన్‌ కు పైగా సినిమాలు చేశాడు. ఇందులో కొన్ని సినిమాలు హిట్‌ కాగా మరికొన్ని ఫట్టాయ్యాయి. దీంతో స్టార్‌ డమ్‌ కోసం హీరో నాగ శౌర్య ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడని చెప్పాలి. అతను ఎంతగా కృషి చేస్తున్నాడో లక్ష్య చిత్రం చూస్తేనే తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాగశౌర్య.. “కృష్ణ వ్రిద్ధ విహారి” అనే డిఫరెంట్‌ టైటిల్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మేరకు ఇప్పటికే టైటిల్‌ పోస్టర్‌, ఫస్ట్‌ లుక్‌ ను కూడా రిలీజ్‌ చేసింది చిత్ర బృందం.

ఈ సినిమాకు ఉషా ములంపూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అనీష్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. మహానటి స్వర సాగర్‌ ఈ సినిమా కు సంగతీ స్వరాలు అందించనున్నాడు. అయితే.. ఈ సినిమా నుంచి తాజాగా ఓ క్రేజ్‌ అప్డేట్‌ ను వదలింది చిత్ర బృందం. ఈ మూవీ ట్రైలర్‌ ను విడుదల చేశారు. ఇక టీజర్‌ లో నాగశౌర్య, హీరోయిన్‌ షెర్లీ మధ్య రొమాన్స్‌ బాగా పడింది. అలాగే వీరిద్దరూ చాలా అందంగా కనిపించారు. కాగా..ఈ మూవీ సెప్టెంబర్‌ 23 వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version