బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగి.. తాజాగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న బ్యూటీ కృతి సనన్. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా హిందీ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృతి నెపొటిజమ్ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. బాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల వారసులు ఎవరైనా తెరంగేట్రం చేస్తే వాళ్లకు ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయని కృతి చెప్పింది.
ఎప్పుడూ సొంత మనుషులకే కాదు.. ప్రతిభ ఉన్న వారికి కూడా చోటు కల్పించాలని ఈ భామ కోరింది. అందిరికీ సమాన అవకాశాలు కల్పించడం ప్రారంభిస్తే పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. అయితే గతంతో పోలిస్తే ఇండస్ట్రీలో ఇప్పుడు పరిస్థితులు మారాయని.. పెద్ద స్టార్ల కంటే ప్రతిభ ఉన్న వారి వైపే సినీ ప్రపంచం మొగ్గు చూపుతోందని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
ప్రస్తుతం కృతి సనన్ ఓ వైపు హీరోయిన్‌గా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఓటీటీ వేదికగా సినిమాలు నిర్మిస్తూ.. ఇంకోవైపు బ్యూటీ ప్రొడక్ట్స్‌తో బిజినెస్‌లోనూ రాణిస్తోంది.