హీరోయిన్ కృతి శెట్టి ఫ్యాన్స్ తో డేరింగ్ సెల్ఫీ ..!!

-

ఇప్పుడున్న హీరోయిన్స్ లో కృతి శెట్టి కి యూత్ లో మాంచి ఫాలోయింగ్ ఉంది. తన సినిమాలు వరసగా ప్లాప్ అవుతున్నా కూడా తన క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. మొదట్లో వరసగా మూడు సినిమాలు హిట్ అయ్యే సరికి తాను టాప్ ప్లేస్ ఉంటుందని అంచనా వేశారు.కాని వరసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

అయినా కూడా ఆమె క్రేజ్ ఎక్కడా తగ్గకుండా ఉంది. ఇక హీరోలకు, హీరోయిన్స్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం చాలా సార్లు మేలు చేస్తుంది. అందుకే కృతి కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మెరుగు పరిచే పనిలో పడింది.తాజాగా కృతి శెట్టి హైదరాబాద్ లో తనను అభిమానించే  ఫ్యాన్స్ మీట్ లో పాల్గొంది. సోషల్ మీడియాలో తన ఫ్యాన్ పేజీలు నడిపే హార్డ్ కోర్ ఫ్యాన్స్ తో కలిసి కృతి ఈ ఫ్యాన్స్ మీట్ నిర్వహించింది.

ఈ శనివారం నాడు హైదరాబాద్ లో జరిగిన ప్రోగ్రామ్ లో కృతి తన అభిమానులను సంతోష పెట్టింది.. తన అభిమానులతో ముచ్చటించి, వారికీ ఫోటోలు ఇచ్చింది. అందరితో కలిసి కృతి ఓ సెల్ఫీ కూడా దిగింది. దీంతో ఆ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎదుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరోయిన్ కూడా ఫ్యాన్స్ తో దగ్గరగా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇంత అందాన్ని దగ్గర నుండి చూసే  కొంత మంది ఫ్యాన్స్ ను కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. అందుకే ఈ సెల్ఫిని అందరూ డేరింగ్ సెల్ఫీ అంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version