లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ విడుదల వాయిదా.. బాబు దెబ్బేశాడుగా…

-

వర్మ రూపొందించిన లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌ విడుదల వాయిదా పడింది…? రేపు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అన్ని షోలు ఉన్నట్టుండి క్యాన్సిల్‌ అయినట్లు తెలుస్తుంది. అంతేకాదు సినిమాకు సంబంధించిన యాడ్స్‌ని కూడా నిలివేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సెన్సార్‌ సర్టిఫికేట్‌ లభించిందని ఆర్జివీ ట్వీట్‌ చేసినా కూడా.. ఇప్పటి వరకు సెన్సార్‌ సర్టిఫికేట్ జారీ చేయలేదని తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈరోజు రాత్రికి వెయ్యాల్సిన ప్రీమియర్‌ షో మాత్రం ఆపేశారని తెలుస్తుంది.. రేపు మార్చి 29న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదలవుతుందా..? లేదా అనేది సస్పెన్స్ లో ఉంది.లక్ష్మీస్‌ ఎన్‌.టి.ఆర్‌ సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేసిన నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ అయ్యాయంటేనే సినిమా గురించి ఆడియెన్స్ ఎంత ఈగర్ గా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు… ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథ ఇదే అంటూ సినిమాపై అంచనాలు పెంచాడు ఆర్జివి.



లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ తో మాత్రం కచ్చితంగా మరోసారి వర్మ సత్తా చాటేలా చేస్తుందని అంటున్నారు. ఏపి హై కోర్ట్ ఈ సినిమా విడుదలను ఆపేయాలని అత్యవసర నోటీసులు జరీ చేసిందట. అయితే అక్కడ కాకుండా కేవలం తెలంగాణాలో మాత్రమే విడుదల చేస్తే డిస్ట్రిబ్యూటర్స్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే సినిమా మరోసారి వాయిదా పడిదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version