వైఎస్ వివేకా హత్య కేసు.. ముగ్గురు అరెస్ట్

-

వైఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి… వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పర్సనల్ సెక్రటరీ కృష్ణారెడ్డి, పనిమనిషి లక్ష్మీ కొడుకు ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కడప జిల్లా పోలీసులు ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

ప్రెస్‌నోట్‌లో ఏముందంటే?

హత్య జరిగిన తర్వాత వివేకానందరెడ్డి డెడ్‌బాడీకి డ్రెస్‌ను మార్చారు. గాయాలకు కట్టు కట్టారు. హత్య సమయంలో కింద పడ్డ రక్తాన్ని తూడ్చేశారు. అది దాదాపు రెండు లీటర్ల దాకా ఉండొచ్చు. గంగిరెడ్డి, కృష్ణారెడ్డి చెప్పినట్టుగా పనిమనిషి లక్ష్మీ కొడుకు ప్రకాశ్ నడుచుకున్నాడు. ప్రకాశే రక్తాన్ని తూడిచేశాడు. రక్తంలో తల వెంట్రుకలు, బొట్టు బిళ్లలు కూడా లభ్యమయ్యాయి. హత్య జరిగిన చోటే లెటర్‌ను కూడా దాచేశారు.



అక్కడి నుంచి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. సాక్ష్యాధారాలను కావాలనే నాశనం చేయాలని ప్రయత్నించారు. నిందితులను కస్టడీ కోసం కోర్టులో హాజరుపరిచాం. కనీసం 15 రోజులు తమ కస్టడీకి అనుమతిస్తే వాస్తవాలను వెలికి తీస్తాం..అయితే.. వీళ్లతో ఈ పని ఎవరు చేయించారు.. అనే విషయంపై ఇప్పటికే ఆధారాలు సేకరిస్తున్నా.. అని పోలీసులు నోట్‌లో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version