వెంకటేశ్ `అసురన్‌` రీమేక్ టైటిల్ అదేనా..?

-

త‌మిళంలో సంచ‌ల‌నం సృష్టించ‌న చిత్రం `అసుర‌న్‌`. ధ‌నుష్ హీరోగా న‌టించిన ఈ చిత్రం కులాల ఆధిప‌త్యం, హ‌త్య‌ల నేప‌థ్యంలో రూపొందింది. మ‌ల‌యాళ న‌టి మంజు వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయ‌బోతున్న విష‌యం తెలిపిందే. ఆ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేశ్ ప్రొడక్షన్స్ వారు సొంతం చేసుకున్నారు. వెంకటేష్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్, కళైపులి ఎస్ థాను సంయుక్త సమర్పణలో ఈ సినిమా రూపొందనుంది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇక‌ ఇటీవలే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లింది.

గ్రామీణ‌ నేప‌థ్యంలో సాగ‌నున్న ఈ చిత్రాన్ని రాయ‌ల‌సీమ అనంత‌పురం నేప‌థ్యంలో రూపొందించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. నెల రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో వెంకటేశ్ తో పాటు ముఖ్య పాత్రధారులు పాల్గొంటున్నారు. అయితే సినిమా టైటిల్ కానీ వెంకీ లుక్ కానీ బయటకు విడుదల చేయలేదు టీమ్. ఇక ప్ర‌స్తుతం ఈ సినిమాకి `నారప్ప` నే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మ‌రి అదే టైటిల్ ను ఖాయం చేస్తారా లేదా అనేది చూడాలి. ప్రియమణి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది ప్రథమార్థంలోనే విడుదల చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news