రాక్షసుడిగా రాబోతున్న నాని….ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్…..!!

-

 

ఇక ఇటీవల గ్యాంగ్ లీడర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒకింత నిరాశపరిచిన నాని, ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి ‘వి’ అనే మూవీలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథ మూలానికి సంబందించి ‘కృష్డుడి గీతలో ఎపుడో చెప్పారు, “రాక్షసుడు” ఎదిగిన నాడు ఒకడొస్తాడని. వాడే ఇప్పుడొస్తున్నాడు, “రక్షకుడు” వస్తున్నాడు’ రక్షకుడి లుక్ 27న, రాక్షసుడి లుక్ 28న అంటూ ఆ సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే ఈ పోస్ట్ ను హీరో నాని రీట్వీట్ చేస్తూ, రాక్షసుడి ఎమోజిని పెట్టారు, ఆ వెంటనే హీరో సుధీర్ బాబు కూడా అదే పోస్ట్ ని రీట్వీట్ చేస్తూ నా ఫస్ట్ లుక్ 27న వస్తోంది అంటూ రీట్వీట్ చేయడం జరిగింది.

 

దీనితో ఈ సినిమాలో నాని తొలిసారిగా విలన్ గా నటిస్తున్నాడు అంటూ వస్తున్న వార్తలకు మరితం బలం చేకూరినట్లైంది. అయితే ఈ సినిమా ప్రారంభ సమయంలో ఒక ఇంటర్వ్యూ లో నాని మాట్లాడుతూ, తన కెరీర్లో ఇప్పటివరకు చేయని ఒక డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇక నేటితో ఈ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్న విషయం తేటతెల్లం అవడంతో ఆయన ఫ్యాన్స్ కూడా తొలిసారిగా నాని ఎలా నటించాడో రేపు సినిమా రిలీజ్ తరువాత థియేటర్ లో చూడాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కాగా ఈ సినిమా ఉగాది కానుకగా రిలీజ్ కానుంది….!!

Read more RELATED
Recommended to you

Latest news