లియో బ్లాక్​బస్టర్ రికార్డ్.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

-

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన తొలి రోజే ఈ సినిమా సూపర్ హిట్ టాక్​తో పాటు బ్లాక్​బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా క్రేజీ రికార్డులు సొంతం చేసుకుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన లియో.. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్​లో దూసుకెళ్లింది.

సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం లియో మూవీ ఫస్ట్ డే రూ.140కోట్లకు పైగా రాబట్టిందట. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్‌ చిత్రంగా ఈ మూవీ మరో రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు నార్త్‌ అమెరికాలో అక్టోబర్‌ 19న విడుదలైన అన్ని సినిమాల్లో ‘లియో’ టాప్‌లో నిలిచిందట. ఇక విజయ్ ఫ్యాన్స్‌ సంబురాలు చూడాలి. వాళ్లను ఆపడం ఇప్పట్లో ఎవరితరం కాదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సరసన త్రిష నటించింది. పార్తిబన్‌ పాత్రలో విజయ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కాకపోతే తెలుగు వెర్షన్​లో వచ్చే పాటలు మాత్రం కాస్త బోర్ కొట్టిస్తున్నాయట.

Read more RELATED
Recommended to you

Latest news