టీమిండియాకు భారీ షాక్ తగిలింది. బంగ్లా మ్యాచ్ లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా ఈనెల 22న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘పాండ్యా బెంగళూరులోని NCAకి వెళ్తారు. వైద్య బృందం అతని చీలమండ స్కాన్ రిపోర్టు అంచనా వేస్తుంది. ఇంజక్షన్ తోనే పాండ్యా కోలుకుంటారు.
బీసీసీఐ ఇంగ్లాండ్ స్పెషలిస్ట్ వైద్యుడిని సంప్రదించినప్పుడు ఇదే అభిప్రాయం వెల్లడైంది’ అని చెప్పారు. అయితే.. నిన్నటి మ్యాచ్లో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా….. IND గెలుపు తర్వాత చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. విజయం సాధించాం. ‘గతం కంటే బలంగా తిరిగి వస్తా’ అని హార్దిక్ ట్వీట్ త్వరగా కోలుకో చాంప్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. త్వరగా కోలుకొని నెక్స్ట్ మ్యాచ్ కు తిరిగి రావాలంటున్నారు. పాండ్యాకు గాయాలు కొత్త కాదని, అతని కం బ్యాక్ గట్టిగా ఉంటుందంటున్నారు. కాగా నిన్నటి మ్యాచ్ లో బంగ్లా దేశ్ పై ఇండియా గెలిచిన సంగతి తెలిసిందే.