తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో రాజమౌళి పేరు ప్రముఖంగా ఉంటుంది. కరెక్ట్ గా సినిమా తీసి రిలీజ్ చేయగలిగితే తెలుగు సినిమా స్థాయి 1000 కోట్లకు పైగానే ఉంటుందని బాహుబలి సినిమాతో నిరూపించిన దర్శకుడాయన.
అప్పటివరకు తెలుగు సినిమా 100 కోట్లు దాటితే చాలు అనుకునే వాళ్ళు బాహుబలి వసూళ్లను చూసి ఆశ్చర్యపోయారు. అయితే బాహుబలి తర్వాత ఎవరు కూడా 1000 కోట్ల ఫీట్ సాధించలేకపోయారు. దాన్ని సాధించడానికి మళ్లీ రాజమౌళి కావాల్సి వచ్చింది.
జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ సినిమాతో మళ్లీ 1000 కోట్ల మార్కును టచ్ చేశాడు రాజమౌళి. ఆయన తప్ప ఇంకెవరూ అలాంటి వసూళ్లను సాధించలేరని చాలామంది అనుకున్నారు. వాళ్ల నమ్మకాన్ని ఇద్దరు దర్శకులు బ్రేక్ చేశారు. వాళ్ళు ఎవరో కాదు నాగ్ అశ్విన్ ఇంకా సుకుమార్.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD చిత్రం 1100 కోట్లకు పైగా కలెక్షన్లను ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. నాగ్ అశ్విన్ గతంలో కేవలం రెండే సినిమాలు తీశాడు. తన మూడవ సినిమాకే 1000 కోట్ల ఫీట్ ని నాగ్ అశ్విన్ సునాయాసంగా అందుకున్నాడు. అఫ్కోర్స్.. దానికి ముఖ్య కారణం ప్రభాస్. కల్కి సినిమాలో ప్రభాస్ హీరోగా కనిపించిన సంగతి తెలిసిందే.
ఇక వెయ్యికోట్ల మార్కును టచ్ చేసిన మరో డైరెక్టర్ సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. దీంతో టాలీవుడ్ లో 1000 కోట్ల కలెక్షన్లు సాధించిన దర్శకుల జాబితాలో సుకుమార్ పేరు చేరిపోయింది.
మొత్తానికి రాజమౌళి కాకుండా ఎవరూ సాధించలేరని అనుకున్న ఫీట్ ని ఈ సంవత్సరం ఇద్దరు దర్శకులు సాధించేశారు. ముందు ముందు ఇంకా ఎంతమంది దర్శకులు 1000కోట్ల మార్కును టచ్ చేస్తారో చూడాలి.