నిమిషం టీజర్ తో ప్రపంచవ్యాప్తంగా బాగా పాపులర్ అయిన ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డేగా ఈరోజు రిలీజ్ అయ్యింది. రోషన్ అద్భుల్, ప్రియా ప్రకాశ్ కలిసి నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.
కథ :
రోషన్, ప్రియా ప్రకాశ్ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవుతారు. మొదటి చూపులోనే ప్రియాని చూసి ఇష్టపడతాడు రోషన్. ప్రియా కూడా రోషన్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అయితే ఓ చిన్న ట్విస్ట్ వల్ల రోషన్, ప్రియా విడిపోతారు. వీరి ప్రేమను కలిపేందుకు గాథ జాన్ (నూరి షెరీఫ్) ను రోషన్ కు దగ్గరయ్యేలా నటించమంటారు. కాని రోషన్, గాథ జాన్ లు నిజంగానే ప్రేమలో పడతారు. మరి ఫైనల్ గా రోషన్ ప్రియాని ప్రేమించాడా..? గాథ షెరీఫ్ ను ప్రేమించాడా అన్నది సినిమా కథ.
ఎలా ఉందంటే :
ప్రేమ కథకు కావాల్సినంత ఎమోషన్ కథలో ఉండేలా చూసుకున్న దర్శకుడు ఉమర్ లులు కథనంలో తేలగొట్టేశాడు. రొటీన్ కథ అని తెలుస్తున్నా సినిమాకు వచ్చిన క్రేజ్ ను వాడుకుని సినిమా ఓ ఎమోషనల్ మూవీగా తెరకెక్కించే అవకాశం ఉంది. కాని మొదటి భాగం మొత్తం రోషన్, ప్రియా ప్రకాశ్ ల మధ్యనే నడిపించిన దర్శకుడు. సెకండ్ హాఫ్ కూడా పెద్దగా మెప్పించలేదు.
అయితే క్లైమాక్స్ మాత్రం మళ్లీ ఆకట్టుకునేలా చేశాడు. రోషన్, గాథ షెరీఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సినిమా అంతా రొటీన్ గా అనిపిస్తుంది. అయితే యూత్ ఆడియెన్స్ కు నచ్చే లిప్ లాక్, కామెడీ కాస్త పర్వాలేదు అనిపించాయి. ప్రేమికుల రోజు లవర్స్ డేగా మళయాళ మూవీ మంచి ట్రీట్ ఇచ్చింది.
ఎలా చేశారు :
రోషన్ అబ్ధుల్ ఎప్పుడూ నవ్వుతూ కనిపించాడు తప్ప పెద్దగా నటించింది ఏమి లేదు. ప్రియా ప్రకాశ్ వారియర్ తన వరకు తాను న్యాయం చేసింది. ఇక గాథ జాన్ గా నటించిన నూరిన్ షెరీఫ్ కూడా బాగా చేసింది. స్క్రీన్ పై ఆమె కూడా బాగా కనిపించింది. ఇక మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించాయి.
సినిమాటోగ్రఫీ బాగుంది. మ్యూజిక్ పర్వాలేదు. రవి శంకర్ డైరక్షన్ ఓకే. కథ, కథనాలు రొటీన్ గా అనిపించాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. తెలుగు డబ్బింగ్ మాత్రం అసలు బాలేదు. అదేదో కార్టూన్ సినిమా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
ప్రియా ప్రకాశ్
నూరిన్ షెరీఫ్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
స్టోరీ
స్క్రీన్ ప్లే
బాటం లైన్ :
లవర్స్ డే.. ఆశించిన స్థాయిలో లేదు..!
రేటింగ్ :
2.75/5