మళ్లీ సీఎంగా జగన్.. దేవినేని అవినాశ్ సంచలన వ్యాఖ్యలు

-

ప్రభుత్వ వైఫల్యాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వం పై పోరాటం ప్రకటించింది. ఈమేరకు ఆ పార్టీ నేతలు విజయవాడలో ఆందోళనలు నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాశ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని విమర్శించారు అవినాశ్.

అమ్మ ఒడి, రైతులకు పెట్టుబడి సాయం, ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్ మెంట్ మహిళలకు 1500 వంటి పథకాలను నీరు గార్చారని దేవినేని అవినాశ్ మండిపడ్డారు. తమ వైఫల్యాన్ని కప్పి పుచ్చుకోవడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే.. వారిపై కేసులు మోపి జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో కూటమికి ఓటు వేసిన 15 శాతం పైగా ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల పేరిట ప్రజలకు హామీలు ఇచ్చి రాష్ట్రంలో చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఎద్దేవా చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version