Sudheer : సుధీర్‌బాబు హీరోగా ‘మా నాన్న సూపర్ హీరో’

-

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు గురించి స్పెషల్‌ గా చెప్పాల్సిన పనిలేదు. వరుస హిట్‌ లతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్‌ హీరో. అయితే తాజాగా సరికొత్త అవతారంలో కనిపించాడు సుధీర్ బాబు. “మామ మశ్చీంద్ర” అనే సినిమా కోసం సుదీర్ బాబు ఈ బబ్లి లుక్ లో కనిపించాడు. ఇక ఈ సినిమా రిలీజ్‌ కాక ముందే మరో ప్రాజెక్ట్‌ ప్రకటించేశాడు సుధీర్‌ బాబు.

సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు ‘మా నాన్న సూపర్ హీరో’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఫాదర్స్ డే సందర్భంగా ఇవాళ మూవీ టైటిల్ ను ప్రకటిస్తూ పోస్టర్ ను విడుదల చేశారు. సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ మూవీకి జై క్రిష్ సంగీతం అందిస్తున్నారు. సుదీర్ బాబుకు ఇది 17వ సినిమా కానుండగా, ఇతర నటీనటుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.https://twitter.com/isudheerbabu/status/1670308069300129792?s=20

Read more RELATED
Recommended to you

Latest news