సీఎం జగన్‌ ను కొట్టేందుకు..విష సర్పాలు వస్తున్నాయి – వైసీపీ ఎమ్మెల్యే

-

ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని కొన్ని విష సర్పాలు బయలు దేరాయని.. ముఖ్యమంత్రి కుర్చీ.కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఒకటయ్యారని కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. పవన్ కళ్యాణ్ సంగతి చెప్పనవసరం లేదని.. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్నాడు…చంద్రబాబు దగ్గర సూట్ కేసులు తీసుకుంటున్న ఆయన ముఖ్యమంత్రి అవుతానని ఏరోజు చెప్పలేదని విమర్శలు చేశారు.

ఎమ్మెల్యే అయితే చాలు శాసనసభలో అడుగు పెట్టాలని అనుకుంటున్నాడే తప్ప ముఖ్యమంత్రి కావాలని లేదని.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడన్నారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రజలు అమాయకులు కాదు.. రాజకీయ నాయకులు కన్నా తెలివైన వారు..చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు మాట్లాడినా… ఎంత విషపు ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరని ఫైర్‌ అయ్యారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news