క్రైమ్ థ్రిల్లర్ గా నితిన్ “మాస్ట్రో” ట్రైలర్

టాలీవుడ్ స్టార్ హీరో నితిన్… హీరోగా మాస్ట్రో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో లో భారీ విజయాన్ని అందుకున్న అంధాదున్ సినిమాకు రీమేక్ గా మాస్ట్రో సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా కు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తుండగా ఎం సుధాకర్ రెడ్డి మరియు నిఖిత రెడ్డి ఇ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అటు నితిన్ సరసన నభా నటేష్ నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ రోల్ చేయనుంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్ డేట్ వచ్చింది.

maestro movie trailer

 

 

మాస్ట్రో ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే…. ఈ సినిమా ఆద్యంతం ఓ మర్డర్ చుట్టూ తిరిగేలా కనిపిస్తోంది. ఆ మర్డర్ ఎవరు చేశారు ? ఎలా చేశారు? హీరో నితిన్ కు లింకు ఏంటి అనే దానిపై ఈ సినిమా స్టోరీ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక ఈ ట్రైలర్ విడుదల తో నితిన్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. కాగా ఈ సినిమాను ఓ టి టి వేదికగానే విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.