ఆమె వల్లే మద్యానికి బానిసై జీవితాన్నే కోల్పోయిన మహానటి సావిత్రి.. !

-

అలనాటి మేటి అందాల తార సావిత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో ఒక ఉన్నత స్థానానికి చేరుకున్న ఈమె ఆ తర్వాత మద్యం అనే చెడు వ్యసనానికి బానిసై సర్వం కోల్పోయి జీవితాన్నే నాశనం చేసుకుంది. అందుకే సావిత్రి సినిమా జీవితంలో ఎన్నో ఎత్తులను అలాగే పతనాన్ని కూడా చవిచూసింది. ఇకపోతే అలా మద్యానికి అలవాటు పడిన వారిలో సావిత్రి మాత్రమే కాదు అప్పటి తరంలో చాలామంది హీరోయిన్స్ ఇలా మద్యానికి అలవాటు పడ్డారు. అయితే కుటుంబం కోసం లేదా ఆరోగ్యం కోసం వారి పరిధిని ఏ రోజు దాటలేదు. హద్దు మీరకుండా జీవితాన్ని సుఖంగా గడిపారు.

అయితే ఇలా సావిత్రి లాంటి ఎంతోమంది సీనియర్ స్టార్ హీరోయిన్లకు మందు అలవాటు చేసిన ఒక మహిళ గురించి చరిత్రలో మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. సావిత్రికి ఒక కమెడియన్ మరియు డైరెక్టర్ తో ఎఫైర్ ఉందని.. ఎల్లప్పుడూ మద్యం తాగుతూ వారితోనే పేకాట ఆడుతూ ఉండేదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. బాల సరస్వతి అనే సురభి కంపెనీ ఆర్టిస్ట్ కి ఉన్న ఈ మద్యం అలవాటే నటీమణులకు కూడా అలవాటై చివరికి సావిత్రిని బానిసను చేసి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసింది.

బాల సరస్వతికి, సావిత్రికి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అంటే సావిత్రి ఇంటికి ఎదురుగా ఉన్న ఎస్వీ రంగారావు ఇంటి కి పక్క సందులో ఒక ఇంట్లో అద్దెకు దిగింది. అక్కడే కూర్చుని మందు తాగుతూ ఉండేది బాల సరస్వతి. అలా ఆమె ఇండస్ట్రీలో ఉంది కాబట్టి పరిచయాలు కాస్త పెరిగాయి. అవకాశాలు అయితే రాలేదు కానీ చాలా మంది హీరోయిన్స్ తో ఆమె కలిసి కూర్చుని చిల్ అవుతూ షూటింగ్ లేని సమయంలో సిట్టింగ్ పెట్టేవారు. అంజలీదేవి, సావిత్రి వంటి వారు ఆమె వేసే జోకులకు మంత్రముగ్ధులై నవ్వుతూ ఆమెతో పాటు తాగేవారు. కానీ అదే సావిత్రి పాలిట శాపం అవుతుందని అనుకోలేదు. చాలామంది జెమినీ గణేషన్ వల్లే మద్యం అలవాటయింది అంటారు. కానీ బాలసరస్వతి వల్లే సావిత్రి మద్యానికి బానిసై జీవితాన్ని కోల్పోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version